:కైతికాలు(అల్పపీడనం పై:---సోంపాక సీత- భద్రాచలం
పంటకు వానగండం!
రైతుకు  ప్రాణగండం!
జనతకు యమగండం!
ఆశలన్నీ సుడిగుండం!
అయ్యయ్యో.. అల్ప పీడనం!
సమాజపటంపై రాలిన దుఃఖపీడనం!!

వాతావరణపు రణమై!
సాగరంలో పుట్టింది!
ఉగ్రరూపపు ఊపిరై !
నట్టింట నిలిచింది !
వారెవ్వా.. వాయుగుండం!*వలలకేవలవేసిన ప్రాణగండం!!

రైతన్నకు కష్టాలు!
అకాల  వర్షాలు!
చేరలేని తీరాలు!
ఎట్లగును హర్షాలు?!
అయ్యయ్యో.. వ్యవసాయం!
చేజారిన ఫలసాయం!!

              
కామెంట్‌లు