అందరిలో వెలుగులు (బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
పల్లెటూరి పిల్లలు
విరబూసిన మల్లెలు
పనిలోన వారంతా
అలుపు లేని జెల్లలు

వారి పరుగులు చూడరు
ఆగకుండ పోయెదరు
వారు చెప్పే మాటలు
చిలుకమ్మ పలుకు జోరు

ఆటలందు మేటి గాను
పాటలందు పోటిగాను 
అన్నింటిలో పొంతన
చదువునందు దీటుగాను

పిల్లలంత మూటిగాను
వారు కలుపు గోలుగాను
కలిసి మెలిసి వుంటూ
అందరిలో వెలుగుగాను

చీకటి నే తరుముతూ
ముందు ముందుకు పోతూ
అందరిలో నిలిచి వారు
వెలుగులన్ని నింపుతూ

దైర్యం లోన ధీరులు
రక్షణ లోన శూరులు
దేశానికి వారంతా
నలుదిక్కుల పాలకులు


కామెంట్‌లు