గాంధీజీ - పర్యటనలో నెల్లూరు :--- ఎం. వి. ఉమాదేవి -నెల్లూరు.
పల్లిపాడు కొచ్చెనంట మనగాంధీ 
ప్రజలతోటి కలిసెనంట మనగాంధీ 
దండి సత్యాగ్రహం బాపూజీ 
దార్శనికుడయ్యెను మనగాంధీ!

ఆశ్రమం చూసినారు మనగాంధీ 
ఆనందం పొందినారు బాపూజీ 
రాట్నమునే తిప్పేనంట మనగాంధీ 
రాజబాట అహింసనే మనగాంధీ 

పోరాటం పిలుపునిచ్చి మనగాంధీ 
ప్రోత్సహించి ఖద్దరును మనగాంధీ 
నగలుదూసి ఇచ్చినట్టి వనితలకు 
నమస్సులు తెలిపెనమ్మ మనగాంధీ 

బానిసలుగా బ్రతుకుటెల అంటూనే 
బలిమితోటి సత్యాగ్రహి మనగాంధీ 
జాతివివక్ష ఖండన చేయుచునూ 
జాతికి జాగృతినిచ్చే మనగాంధీ 

పల్లిపాడు కొచ్చెనంట మనగాంధీ 
వెల్లువగా  పాడె ప్రజలు  జయహేను !