తాడూ కాదు తామర మొగ్గ
మొగ్గా కాదు మోదుగ పువ్వు
పువ్వూ కాదు పూసల దండ
దండా కాదు ద్రాక్షా తీగ
తీగా కాదు తీపి బూందీ
బూందీ కాదు బుడగల గుత్తి
గుత్తీ కాదు గుమ్మడి పాదు
పాదూ కాదు పక్షుల గుంపు
గుంపూ కాదు గూట్లో దీపం
దీపం కాదు దిగుడు బావి
బావీ కాదు బండీ చక్రం
చక్రం కాదు చామా గడ్డ
పళ్లెం కాదు పాపటి బిళ్ల
బిళ్ళా కాదు బీరా కాయా
కాయా కాదు కమ్మనిబువ్వ
బువ్వా కాదు బూరుగు పరుపు
పరుపూ కాదు పచ్చని చేలు
చేలూ కాదు చెల్లీ తమ్ముడు
తమ్ముడి తోటి తాడూ ఆట!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి