శత్రువులెవరు?( బాల గేయం ):-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
వింత వింతల లోకంలో 
ఒకరికి ఒకరు మిత్రులేగా!
పిల్లి కుక్క శత్రువు లైతే 
ఎలుకకి పిల్లి యముడేగా !

ఒకేచోటనే పెరిగినప్పుడు 
ఒకరికి ఒకరు దోస్తులేగా 
ఆటలు ఆడి గంతులేసి 
అలిసిపోయిన మిత్రులారా 

ఒకరిమీదొకరు కాళ్ళేసిరి 
ఆదమరిచి నిదురపోతిరి 
పిల్లల్లారా చూడండి 
ఐకమత్యం ఆనందమండి!


కామెంట్‌లు