విశ్వ సృష్టి -(బాల గేయం ):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
వింత వింతల సృష్టిలోన
పువ్వులుంటాయి 
అంతరాళం సూపర్ నోవా 
ప్రేలుళ్ళుo టాయి 

చిన్న చిన్నవి ముద్దులొలికే 
పులుగులుంటాయి 
పెద్ద పెద్దవి క్రూర మైనవి 
ఎలుగులుంటాయి 

తోటలూ మరి కాలువలు 
జలపాతాలుంటాయి 
బాటలూ సరి ఆనకట్టలు 
కోట లుంటాయి 

కొండలోయ్ ఇక లోయలోయ్ 
బలె  బండలుంటాయి 
కడలి తీరం వెదికి చూడుము 
గవ్వ లుంటాయి 

తరువులూ మరి గనులతో 
ఉపయోగాలుంటాయి 
గురువుగారి ఆశీస్సులతో 
చదువులుంటాయి ! 

సూర్య చంద్రులు తారకలు 
మరి మెరుస్తుంటాయి 
మేఘమాలలో నీటి నిధులే 
దాగి ఉంటాయి!

పచ్చ పచ్చని పంట చేలలో 
గింజలుంటాయి 
రాజు పేద ఎవరికయినా 
విధులు ఉంటాయి !


కామెంట్‌లు