బాల్యం బందీ అయిపోయింది
బహుళ అంతస్తుల్లో ,ఒక అంతస్తు
అందులోనే జీవితం
ఆటైనా పాటైనా చదువైనా
అమ్మా నాన్నల ప్రేమైనా
అమ్మమ్మ నానమ్మ తాతయ్యలువస్తే
చుట్టము చూపే
అంకుల్ ఆంటీ తప్ప
ఇంకోవరుస తెలువదాయె
మన ఆటలు తెలువవాయె
ఆడుదామంటే స్థలమే లెదాయె
వాడకట్టులేదు సోపతులు లేవు
అరేయ్ ఒరేయ్ పిలుపుల్లేవు
ఉప్పుబస్తా మోసుడులేదు
టొక్కా కొట్టుడు తెలువదు
కోతికొమ్మ లేదు
చెండీదెబ్బ ,పయ్యతిప్పుడు ,చిర్రంగోనె ,ఎన్నెన్ని ఆటలు
మోటబావిలో ఈతల్లేవు
శరీర శ్రమ అసలేలేదు
సెల్లుఫోనులో ఆటలు
ల్యాపుటాపులో సదువులు
పంజరంలో చిలుక బయటకు
పోలేదు
మనిషి బాల్యమంతా
పంజరంలో భందీ అయ్యింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి