పిల్లలు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చెరువులు జలముతొ నిండాయి
చేపలు వలముగ పెరిగాయి
పిల్లలు గాలము వేశారు
చేపలు బాగా పట్టారు
మేలములాడుతు వారంతా
చేపల వాలము పట్టుకుని
కేలము త్రిప్పుచు
కోలము చేయుచు
కాలము తెలియక
ఎలముతొ ఇళ్ళకు వెళ్ళారు !!
(వలము=విస్తారము.,
మేలము=పరిహాసము.,
వాలము=తోక.,
కేలము=చెయ్యి.,
కోలము=నాట్యము.,
ఎలము=సంతోషము)

కామెంట్‌లు