'ఆద్య' గ్రాడ్యుయేషన్ వేడుక :- టి. వేదాంత సూరి

 అవును ఇది నిజంగా నిజం .. ఆద్య మూడేళ్ళుగా ఆక్లాండ్ లోని లాలిపాప్ డే కేర్ సెంటర్ లో ఉంటుంది  అక్కడ 2018 ఏప్రిల్ లో చేరి ఎన్నెన్నో నేర్చుకుంది. . అక్కడ చేరిన మొదటి రోజు అంతా కొత్త. ఎవరు ఏమంటారో అనే భయం, ఆటలు ఆదుకోవాలనే తాపత్రయం ..ఆరోజు నేనూ వెళ్లి ఆద్యతో వున్నాను.. ఇప్పుడు ఆద్యకు పాఠశాలకు వెళ్లే వయసు వచ్చింది . కాబట్టి డే కేర్ ను వదిలి పెట్ట వలసి వచ్చింది. ఈ విషయం చెప్పగానే వాళ్ళ టీచర్ రూబీ ( ఆమె కూడా భారతీయురాలే) శుక్రవారం మర్చి 12 వ తేదీన ప్రత్యేకంగా  గ్రాడ్యుయేషన్ డే  ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. అందరమూ 10 గంటల వరకు చేరుకున్నాం. ప్రత్యేక  టేబుల్,, వెనుక ఫోటోల బానర్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల ఫోటోలు తీశారు. ఆద్యకు గ్రాడ్యుయేషన్ గౌన్ వేసి, కాప్ పెట్టి సర్టిఫికెట్ అందించారు. టీచర్స్, పిల్లలు కలిసి ఆద్య తో తమ అనుభవాలు చెప్పారు. చాల మంచిదని, ప్రేమగా ఉంటుందని, సహాయ పడుతుందని, చక్కగా మాట్లాడుతుందని, తెలివిగా ప్రవర్తిస్తుందని , స్నేహానికి విలువ ఇస్తుందని, పెద్దలను గౌరవిస్తుందని, చెబుతుంటే మాకు ఎంతో ఆనందం వేసింది. ఆద్య చదువులో ఇది తొలి  మజిలీ కదా ఎప్పుడూ గుర్తుండి పోతుంది ఆ తరువాత అందరూ పిల్లలు వచ్చి ఆద్యను హాగ్ చేసుకున్నారు. తమ జ్ఞాపకాలతో కూడిన పత్రాన్ని అందించారు. కలిసి ఫోటోలు తీయించుకున్నారు. ఉపాధ్యాయులు కూడా ఆద్యను మిస్ అవుతామని చెప్పుకొచ్చారు. కానీ జీవన ప్రయాణం లో తప్పదు, స్కూల్ లో చేరాలి కదా. అయితే ఈ వేడుక ఆద్యకు, కుటుంబ సభ్యులందరికి తీపి జ్ఞాపకం గా ఉంటుంది. ఇలా ఆద్య గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకుని డే కేర్ కు ప్రేమగా వీడ్కోలు , అందరికి దగ్గరికి వెళ్లి ధన్యవాదాలు చెప్పి వచ్చింది .