నా పిచ్చుక :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
బుల్లి బుల్లి అడుగులేసి 
నడుస్తుంది నా పిచ్చుక 
అల్లి బిల్లి ఆటలెన్నో 
ఆడుతుంది నా పిచ్చుక!

చారెడు గింజలు వేస్తే 
చక్కగాను తింటున్నది 
పూల మొక్కల్లో పురుగులు 
పొడుస్తుంది నా పిచ్చుక !

వరండాలో కవాతు చేస్తది 
నీరెండల్లో ఇసుకలో పొర్లు 
నీటి తొట్టెలో స్నానం చేసి 
అట్ఠపెట్టెలో బజ్జుo టుంది!


కామెంట్‌లు