అక్షరమాలికలు: -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.


 ఏకపది:(పసుపు)

*******

1.వంట యింటి ద్రవ్యాలలో_ముఖ్యమైనదిగా పేరు పొందినది.

2.పంటలలో అద్వితీయమైన_సుగంధ ద్రవ్యాల రారాజు.


ద్విపదం:(పంట)

*******

1.ఎత్తుగా పెరిగిన ‌పచ్చదనాల సస్యలక్ష్మి.

ధాన్యాన్ని అందించే నేలతల్లి సంతోషం.

2.నీళ్ళు,ఎరువు,విత్తనాలతో పెరిగేది.

నాగలి దున్నుటతో వృద్ధిపొందే ధాన్యలక్ష్మి.


త్రిపదం:(నీటబావి)

******

1.నిండైన నీటితో అన్ని అవసరాలకు నీరు ఇస్తుంది.

పొలాల్లో నిలిచి భరోసా ఇస్తుంది.

రైతుల నేస్తమై పంటలకు ఉపయోగపడుతుంది.

2.పాతాళగంగను పైకి తెచ్చి ఇచ్చేది.

నీటితో నిలువ ఉండే ధాన్యాల నేస్తం.

నిరంతర జల ఊటతో నీళ్ళకు ఆధారమైనది.


చతుర్థపదం:(కరెంటు కోత)

***********

1.వేళాపాళా లేకుండా పనులకు అడ్డంకిగా నిలుస్తుంది.

నీళ్ళ అవసరాలకు విఘాతం కలుగుతుంది.

వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి.

నిర్ణీత వేళల్లో ఉంటే ఇబ్బంది‌ కలగదు.

2.నాణ్యమైన విద్యుత్తు లేకుంటే వ్యవసాయ పనులకు ఆటంకమే.

మోటారు పంపులు,వరికోత మిషన్లు మొదలైన వాటి పనికి‌‌ ఆటంకం.

ముఖ్యంగా రాత్రిపూట తిప్పలు తప్పవు.

కోతల వల్ల అనేక నష్టాలు కలుగుతాయి.