'సాహసం'.... ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య


 నేను అప్పుడు 40 ఏళ్ళు ఉంటాను అనుకుంటా. ఒకనాడు నరసింహా రెడ్డి సారు గారు వచ్చి-మల్లారెడ్డి అనే యువకుడితో... సర్కార్ బావిలో బొక్కెన పడింది. తీస్తావా అని అడిగాడు. అబ్బో ఆ బావి లోనా.. 20 గజాల లోతు కలిగి, అడ్డం లో పది గజాల ఉంటుంది. నాతోనికాదుఅని అన్నాడు. అదో పెద్ద ముచ్చట నారా... యువకుడువి నీతోని కాదా.. అని నేను అన్నాను. మస్తుగా చెప్పొచ్చు సార్. దమ్ముంటే నువ్వు తీయి చూస్తా అన్నాడు.. సరే! పా... నేను తీస్తా అన్నాను. నరసింహారెడ్డి-నీతోని కాకపోవచ్చు! అని అనుమానం వ్యక్తం చేశాడు. లేదు సార్! నేను తీసే చూపుతాను అన్నాను. అప్పుడు ఐదారుగురు ఉన్నారు. అందరము సర్కారు బావి దగ్గరికి వెళ్ళాం. బావిలోకి తాడు వదిలారు. తాడు పట్టుకుని దిగేటప్పుడు అవలీలగా దిగాను. అక్కడ తాడుకు బొక్కెన కట్టాను. ఎక్కేటప్పుడు ఇక ఎటూ కాళ్లు అందక... ఇటూ అటూ ఊగుతూ ఉన్నాను. పూర్తి బలం తాడు మీదనే పెట్టాల్సి వచ్చింది. చేతులు తిమ్మిరి ఎక్కాయి. చేతుల తాడు ఉన్నది లేనిది కూడా తెలవక.. స్పర్శజ్ఞానం లేదు. మీద ఉన్న వాళ్లకు నా పరిస్థితి అర్థమైంది. ఎక్క రాకపోతే కిందికి అలాగే దిగు. మేము తొట్టెల దించు తాము. ఆ తొట్టెలలో కూర్చుండి రావచ్చు అని అన్నారు. నేను ఏమి కాదు.. ఏమి కాదు... అనుకుంటూనే... చల్లగ చెమటలు పడుతుండగా ఏదోలా ఎక్కాను. నా సాహసానికి పైన ఉన్న వారు అందరూ అభినందించారు. నరసింహా రెడ్డి సారు అక్కడ ఉన్నవాళ్ల కంత కారా తినిపిచ్చి, ఛాయలు తాగించాడు.