తల్లి తండ్రి లేని వారు
అన్నా తమ్ముడు
అక్క చెల్లి
ఎవరు లేని వారు
అనాథలు అభాగ్యులు
ఇల్లు వాకిలి లేని వారు
సూత్రం తెగినా పటాలు
గాలి పోయిన బుడగలు
తీర్చుకోవాలి వాళ్లకు వారే
ఆకలి దప్పులు
ఏరు కోవాలి చిత్తుకాగితాలు
చెత్త వస్తువులు
పేర్చు కోవాలి ఫ్లాస్టిక్ దొంతరులు
అమ్ముకోవాలి ఏరుకున్నవన్ని
తినాలి కొనుక్కొని తెచ్చుకొని
తిరగాలి రోడ్లన్నీ
అనాథలైన పెద్దలన్ని పిల్లల్ని
బతకాలి కూడు గుడ్డ పుట్టించుకొని
పడుకోడానికి సిమెంటు పైపులను బస్టాండ్లను
రైల్వే ఫ్లాటుఫార్మలను
లేకుంటే గుళ్ళు గోపురాలను
వారికవే బెడ్డు రూములు
ఉండవు దుప్పట్లు
చలికి గాలికి పురుగు పుట్రా
వగైరా గట్రా
దొరకవు నగా నట్రా
తిని పారేసిన ఇస్తారాకుల్లో
మిగిలిన మెతుకులే
వారికి అమృత సమానం
వారి ఆకలి మంట తీర్చే
చల్లార్చే గ0దం
నిదుర పోయేందుకు
పైపులే పట్టుపరుపులు
గరీబ్బోలకు చేతులే గలీబులు
ఈ విశాల ప్రపంచమే గృహాలు
మారేదెప్పుడో ఈ బతుకులు
ఎవరు భర్తీ చేస్తారో ఈ గతుకులు
అంతవరకు తప్పవు ఎదురుచూపులు
ఏ నాయకులు తీసుకొస్తారో
మార్పులు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి