ఆటవెలది పద్యాలు:-ఉండ్రాళ్ళ రాజేశం
తల్లి చెల్లి బిడ్డ ఆలిగా మహిళలు
పిలుపులోనవున్నబేధమేను
జన్మనిచ్చు తల్లి శక్తిని పంచేటి
పాద వందనంబు పాటిగాను

ఆడబిడ్డలున్న అందమైనిల్లుండు
గల్లు గల్లు మోత గడపలోన
చదువు సంధ్యలందు సకలము చతురులై
నేటి మహిళకెవరు సాటి యిపుడు

ఉన్నతాన విద్య ఉద్యోగిగా సాగి
విజయమందు పడతి విజ్ఞురాలు
కష్టమెంతవున్న కన్నీరు దాచుతూ
కలిసిసాగు స్ర్తీలు గడియ గడియ

ఓర్పు సహనశీలి నేర్పరి రారాణి
ఇల్లు చక్కదిద్దు యింతి యిలను
సకల గుణములున్న సాధ్వీత మాతల్లి
సకల మార్గదర్శి జాగృతంబు