వాత్సల్యం(నానీలు):-డా.రామక కృష్ణమూర్తి=బోయినపల్లి,సికింద్రాబాద్.
1.మనసు మురిసి
కురిపించే అమృతం
సహజమైన ప్రేమకు
ప్రతిరూపం.

2.వయసుతో వచ్చిన
హృదయసంబంధం
ఆచరణతో మెచ్చును
లోకమంతా.

3.పరిణతి సంకేతం
ప్రశాంత నిలయం
చెరగని సంతకం
తీపి జ్ఞాపకం.

4.బేధాలు లేవు
కొలమానాలు కానరావు
పోలికలు నాస్తి
అమూల్య ఆస్తి.

5.తల్లిదండ్రులు
అన్నదమ్ములు
అక్కచెల్లెళ్ళు
వాత్సల్య నిధులు.

6.తోడూనీడై
అండాదండై
జీవితాన ముదము 
నింపెడి మంత్రం.

7.గురువుల గుర్తు
పెద్దవారి పేరు
విశ్వమంతా నిండే
సజీవ సాక్ష్యము.

కామెంట్‌లు