ఋతువులు(బాలగేయం)-సత్యవాణి

 ఋతువులు ఎన్నిర అన్నయ్యా?
ఋతువులు ఆరే చెల్లాయీ!
ఋతువుల ధర్మం తెలుపన్నా!
తెలిపెద వినవే చెల్లాయీ!
వసంతువున చెల్లాయీ
వనములు కలకలలాడునులే
మల్లెలు జాజులు మరువములు
చక్కగ ఘుమఘుమలాడునులే
గ్రీష్మ ఋతువులో చెల్లెమ్మా
ఎండలు మంటలు రేపునులే
చెరువులు నూతులు ఎండునులే
మామిడి పనసలు తాటిముంజలు
తాపము చక్కగ తీర్చునులే
వర్షఋతువులో చెల్లాయీ 
వానలు మెండుగ కురియునులే
చెరువులు చెలకలు నిండునులే
రైతుల మొఖములు వెలుగునులే
శరదృతువులో చెల్లాయీ
వెన్నెల వెండిల మెరియునులే
మబ్బులు లేకను ఆకాశం
మెండుగ అందం చిందునులే
హేమంతఋతువులొ చెల్లాయీ
హిమమము హెచ్చుగా కురియునులే
బంతీ చేమంతి పూలబాలలు
మురిపములొలుకుతూ
పూయునులే
శిశిరఋపువులో చెల్లెమ్మా
చెట్లఆకులురాలునులే
మోడుగ చెట్లూ కనపడుచూ
వసంత ఋతువుకై చూచునులే