హంస నెమలి ఆటలతో
వీణరాగాల పాటలతో
మమ్ము బ్రోచేతల్లివమ్మా
బాసరలోని భాణివమ్మా
శ్వేతవర్ణ తామర రెక్కల్లో
కొలువు తీరిన అమ్మవమ్మా
చదువుల నిచ్చు దేవతవమ్మా
మా కోరిక తీర్చగ రావమ్మా
మాకునీవిచ్చిన విద్యా జ్ఞానం
దొంగలకు దొరకని నిధి యది
చదువుల జ్ఞానం తో మేము
మరువక మదిలో తలిచెదమమ్మా
మల్లె పూలాంటి మనసుతో
మధుర మైన పలుకులతో
చక్కని తల్లి సరస్వతి దేవి
చల్లని దీవెనలియ్యమ్మ తల్లి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి