నాన్న:-- యామిజాల జగదీశ్
 పది నెలలు మనం
ఏ కష్టమూ తెలియక
నివసించిన అమ్మ గర్భకోశం
అతి పవిత్రమైనది!
అలాగే మనం పడిపోతున్నప్పుడల్లా
పట్టుకుని నిలబెట్టిన
నాన్న చేతులూ అంతే పవిత్రమైనవి!
పలువురి జీవితంలో
చివరి వరకూ అర్థంకాని
పుస్తకం నాన్న.... !
పిల్లలు అడిగిన వాటిని
కొనివ్వడంలోనే 
నాన్న సంతోషమూ, తృప్తీ
నిండుగా ఉంటాయి!
మనల్ని భూజాలపై కూర్చోపెట్టుకుని
చూసుకుని మురిసిపోయిన నాన్నకెప్పుడూ
తలదించుకునే పనులేవీ చేయక
బతగ్గలిగినట్లయితే
అంతకంటే ఇంకేం కావాలి నాన్నకు....
ప్రతి ఒక్కరూ 
ఆస్వాదించిన సంగీతం
నాన్న గుండె చప్పుడు కాక

మరేముంటుంది!
తన శ్వాస ఉన్నంతవరకూ
మనల్ని ప్రేమించి
మనకోసం శ్వాసించింది
మన నాన్న మాత్రమే
నాన్న మనకు ఏం చేసారో అని
తలచుకుని నెమరేసుకోవడానికి
ఎన్ని సంవత్సరాలు పడుతుందో
చెప్పలేం....
మనకు 
మంచి నడతా నడకా నేర్పిన 
గురువు
నాన్న కాక మరెవరుంటారు....
ప్రేమను మాటల్లో చెప్పకుండా
తన శ్రమతో తెలియజెప్పే ఏకైక బంధం
నాన్న మాత్రమే
మనకోసం అమ్మ శ్రమించడాన్ని
మనం గుర్తించగలం
కానీ
తండ్రి మన కోసం శ్రమించడాన్ని
ఇతరులెవరైనా చెప్తేనే తెలిసొస్తుంది
ఇన్ని రోజులూ మనల్ని తన భుజాలపై
ఇంతలా ఇన్ని మాటలు 
రాయగలిగిన నేను 
అటు నాన్నకూ భారమే అయ్యాను
ఇటు కొడుక్కీ భారమే అవుతున్నాను