విద్యవిలువ - డా.బెల్లంకొండడనాగేశ్వరరావు.- చెన్నై

 సుగుణమ్మ భర్తనుకోల్పోయి రెండు పాడి పసువులతో జీవనం గడుపుతూ తన పదేళ్ళ కుమారుడు రామం తో జీవిస్తుండేది.చదువుపై ఆసక్తిలేని రామం క్రమంగా బడికివెళ్ళకుండా చెరువుల్లో ఈతవేస్తూ,గేదెలు కాసే వారితో ఆటలు ఆడుతూ ఉండేవాడు. ఒకరోజు సుగుణమ్మ అన్నయ్య ఊరినుండి రామం వాళ్ళఇంటికి వచ్చాడు.
రామం చదవడంలేదని తన అన్ వద్ద తనబాధను చెపుకుంది సుగుణమ్మ.'బాధపడక వాడిని నాతో మాఊరు తీసుకువెళతాను నాలుగురోజులు ఉండివస్తాడులే' అని రామాన్ని తమఊరైన గుంటూరు తీసుకువెళ్ళాడు. మరుదినం ఊరు చూడటానికి తనమామయ్య మోటర్ సైకిల్ పై బయలు దేరాడు.కొంతదూరం వెళ్ళినతరువాత పోలీసులు దారిలో వెళ్ళే వాహనాలను పక్కగా వెళ్ళమని హెచ్చరిస్తున్నారు.
రాము ఉన్న వాహనం కలక్టెర్ ఆఫీస్ ఎదురుగా పోలీసులు ఆపారు.ఇంతలో కలక్టెర్ గారు కారులో వచ్చిదిగడంతో అంతా ఆయనకు సెల్యుట్ చేస్తు వినయంగా ఆయనను అనుసరించారు. ఇదంతాచూసిన రామం'మామయ్య ఆయన ఎవరు?పోలీసులతోసహా వీళ్ళంతా ఆయనను చూసి ఎందుకు భయపడుతున్నారు' అన్నాడు.ఆయన కలెక్టరుగారు, అంటే ఈజిల్లాకి ప్రధమ పౌరుడు.ఈజిల్లా అంతా ఆయన ఆధీనంలో నడుస్తుంది, అయినా ఇలాంటి పదవులు నిర్వహించాలంటే బాగాచదవాలి. నువ్వుబాగా చదివి మంచి మార్కులు సాధిస్తే చాలు మంచి ఉద్యోగం లభిస్తుంది.
ఔషదం తీసుకునే సమయంలో అది చేదుగానే ఉంటుంది కాని అదిశరీరంలోనికివెళ్ళి స్వస్ధతను చేకూర్చుతుంది.విద్యకూడా అంతే చదివే సమయంలో ఇబ్బందిగానే ఉంటుంది ఉత్తీర్ణత పోందాక దానివిలువ తెలుస్తుంది.అయినా నువ్వు చదవవుగా!నీకు తెలియదా? విద్యలేనివాడు వింతపసువు అని' అన్నాడుమామయ్య. రెండురోజులఅనంతరం రామంఊరు చేరినదగ్గరనుండి బుద్దిగా బడికివెళ్ళి శ్రధ్ధగా చదవసాగాడు.రామంలో వచ్చిన మార్పుకు సంతోషించిన సుగుణమ్మ వాళ్ళఅన్నయ్యకు ఫోన్ చేసి'అన్నయ్య నువ్వు రామానికి ఏంచెప్పేవోకాని చక్కగా బడికివెళుతున్నాడు చాలాశ్రధ్ధగా చదువుతున్నాడు'అన్నది.
నేను రామానికి విద్యవిలువ తెలియజేసాను.నాలుగు గోడలమధ్య నిర్బంధంగా నేర్పేవిద్య విలు వాడికి తెలియజేసాను.బాగాచదవడంవలన ప్రయోజనం స్వయంగా తెలుసుకోవడంవలన రామంలో విద్యపైన అవగాహన కలిగింది.విద్య మానోవికాసంతోపాటు సఘంలో గౌరవం పెంచుతుంది అని రామం విద్యవిలువతెలుసుకున్నాడు'
అన్నాడు రామం మామయ్య.