వచ్చిందమ్మ వచ్చింది
వానాకాల మొచ్చింది
నల్లని మబ్బులు తెచ్చింది
చిన్నగ జల్లులు కురిసింది
చిట్టి బాబు వచ్చాడు
రాలే చినుకులు చూసాడు
గొడుగు చేత బూనాడు
మొక్కలు కొన్ని తెచ్చాడు
పెరటి లోకి వెళ్ళాడు
పాదులు చేసి పెట్టాడు
మొక్కులు కొన్ని నాటాడు
చిన్నగ చిగురు వేసాయి
వృక్షం లా ఎదిగాయి
గాలి నీడ నిచ్చాయి
ఎండకు వానకు ఆ గొడుగు
ఎంతో హాయిగా ఉంటుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి