పిల్లలు (బాలగేయo):-- దండు ప్రణవి -6 వ తరగతి-జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ,లక్ష్మీదేవిపల్లి మండలం: నారాయణపేట జిల్లా: సిద్దిపేట

 భలే భలే బాలలు 
బడికి వెళ్లే పిల్లలు 
చదువులన్ని చదవాలి 
గురువులను గౌరవించాలి
పెద్ద చదువులు చదివి 
అమ్మానాన్నలకు పేరు తేవాలి 
అమ్మ కి ఎదురు చెప్పొద్దు
 నాన్న జాడలో నడవాలి 
అమ్మానాన్నలకు ఆసరవ్వాలి
పేదలను అభిమానించాలి
 మూగ జీవులను ప్రేమించాలి
 అహింసను విడనాడాలి 
ఆటపాటల్లో గెలుపు సాధించాలి 
గురువులకు మంచిపేరు తేవాలి 
అందరూ మనల్ని మెచ్చుకోవాలి
కామెంట్‌లు