మత్స్యావతారం( గేయ కథ)( మణి పూసలు) ( 2 ) వ భాగము:-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
బ్రహ్మకు పగటి కాలం
దగ్గర పడను సమయం
ఆసన్న మగుచున్నది
జరుగును జలప్రళయం

భూమిమీదను మొత్తము
సృష్టి కొరకు విత్తనము
ఔషధములు పట్టుకుని
ఋషులతో నానెక్కుము

శ్రీహరి చెప్పిన విధముగ 
జలప్రళయం చేరువగ
ముంచుకొస్తుంటే నావ
రాజు దగ్గరకు చేరగ

ఔషధ బీజాల తో 
నావ ఎక్కె ఋషులతో
బయలుదేరెను నావ
చూసి సంతోషంతో


కామెంట్‌లు