**పుస్తకాలు-మన నేస్తాలు**:-- చైతన్య భారతి.పి- హైదరాబాద్- 7013264464.
    తల్లిదండ్రులద్వారా లోకానికి పరిచయం కాబడిన నేను...
   అదిగురువులనబడే అమ్మానాన్నల లాలన పొందిన నేను...
   గుడిలాంటి బడిలో జ్ఞాన సంస్కారాల కాశయాన్ని తాగిన నేను...
   అనుకోకుండా పుస్తకాల నేస్తాల చెంతకు లాగబడ్డాను.

   చదివిన కొద్దీ మరల చడవాలనిపించింది..
   లోలోతు మాధుర్యం,రసజ్ఞతలను ఆస్వాదింప చేసింది..
   జీవితకాల పర్యంతం ఎన్నో దారులను చూపుతూ వచ్చింది..
   నలుగురిలో ఉన్నా నన్ను ఏకాంతానికి  తీసుకెళ్లింది..

   నా శూన్య మనోఫలకంపై సువర్ణాక్షరాలను లిఖించింది..
   అగాథలోతుల్లో అమృత ధార కురిపించింది..
   జీవిత ఆంతరంగంలో విశాల ప్రపంచాన్ని విహరింపజేసింది..
   బాహ్య లోకాన్ని కాదని ఆనంద సంద్రంలో లోలలాడించింది..


కామెంట్‌లు