ఉగాది: --వేముల వైష్ణవి, 8వ తరగతి-యం. పి. యు.పి.ఎస్. జగదేవ్ పేట,-మండలం. వెల్గటూర్, జిల్లా. జగిత్యాల

 ఉగాది పండుగ వచ్చింది
నవ వసంతం తెచ్చింది
కోకిల గానంతో ప్రకృతి మురిసింది
తెలుగు వారి సంస్కృతిని చాటింది
పంచాంగ శ్రవణం భవిష్యత్తును తెలిపింది
ఆరు రుచులతో పచ్చడి అదిరింది
అనుబంధాలను కలిపింది
జీవిత పాఠం నేర్పింది
తెలుగువారి గొప్పను చాటింది
కొత్త ఆశలు రేపింది
మంచికి మార్గం చూపింది..

కామెంట్‌లు