*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౮౩ - 83)

 కందము :
*నీపరులను అడిగిన జనులకు*
*కురుచసుమీ యిదియటంచు | గరుతుగ నీవు*
*న్గురుచుఁడవై వేడితి మును*
*ధరఁ బాదత్రయము బలిని | తద్దయు  కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
మన సమాజంలో చేయి చాచి వేరొకరిని అడగడం చున్నచూపుతో చూడబడుతుంది.  కానీ సత్యమును నిలబెట్టడానికి, ధర్మాన్ని నడిపించడానికి ఎదుటు వారి వద్ద చేయి చాచడం ఏమాత్రము చిన్నతనము కాదని మన నిరూపిండానికి వామన మూర్ఇగా వచ్చి బలి చక్రవర్తి దగ్గర మూడు అడుగుల భూమిని దానంగా అడిగి తీసుకున్నావు కదా, వాతాత్మజ వందిత పరమాత్మా!...అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*ధర్మ సంస్థాపనలో యాచన ఏమాత్రం చిన్నతనం కాదు అని నిరూపిస్తూ వామన అవతారం ధరించి బలి చక్రవర్తి ని మూడు అడుగుల నేలను దానం అడిగి, రెండడుగులలో భూమిని, ఆకాశాన్ని ఆక్రమించినప్పడు, బలి నిన్ను రాక్షసాంతకుడగు శ్రీమహావిష్ణువు గా గుర్తెరిగి మూడవ పాదం  పెట్టడానికి తన తలను ఇస్తాడు.  ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే! యుగే! అని నీవే చెప్పి వచ్చి మరీ చూపావు కదా, కుబ్జోద్ధారా!.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు