కరోనా చీకట్లను తరిమేస్తుందేమోననుకున్న శార్వరి
సెకండ్ వేవ్ ను వదిలి వెళ్లుతుంది!
ఆరోగ్యరాగాలు ఆలపిస్తుందేమోననుకున్న మత్తకోకిల
అప్రమత్తమవ్వండనే సందేశగీతం పాడుతుంది!
భయపుపత్రాలను రాల్చిన శిశిరం
జాగరూకతను చిగురిస్తూ
వాసంతాన్ని ఆహ్వానిస్తుంది!
కష్టాలకు కన్నీళ్ల కు
ఆనందాలకు సుఖాలకు
సమంగా స్పందించమనే
చడ్రుచుల ఉగాదిపచ్చడి
కరోనాతో సమరంసాగించేందుకు సమాయత్తం చేస్తుంది!
సమస్యను చూసి పారిపోవడం కాదు
పోరాడి సాధించుకోవాలని
కొత్తసంవత్సరం
*వి"ప్లవ" మై వర్థిల్లమంటోంది!
మార్పును స్వీకరించమని
సంకల్పాన్ని పుంజుకోమని
మనోధైర్యంతో సాగమని ఉగాది చెప్పకనే చెబుతుంది!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి