సకల సద్గుణాభిరాముడుసర్వజగత్తుకు మార్గదర్శకుడు!తండ్రిమాటను జవదాటని పుత్రుడునేటియువతకు ఆదర్శప్రాయుడు!ఏకపత్నీవ్రతుడైన వినమ్రుడువిలువలకు స్థానమతడు!ధర్మసంస్థాపనకై అవతరించిన భగవంతుడుకుటుంబవ్యవస్థకు మూలమతడు!ఆడినమాట తప్పని వాడుసోదర ప్రేమకు చిహ్నమతడు!నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంభక్తులపాలిట కొంగు బంగారమతడు!శబరి ఎంగిలిపళ్లను తిన్న శరణాగత వత్సలుడు!గుహుని పావనమొనరించిన పట్టాభిరాముడు!సుగ్రీవునికి ప్రియబాంధవుడురావణ సంహారకుడు రఘురాముడు!భార్యప్రేమకై మాయలేడిని తేదలచినవాడుసత్యవాక్ పరిపాలకుడు లోకాభిరాముడు శ్రీరాముడు!
*జై శ్రీరాం*:-అయిత అనిత-8985348424
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి