పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432
ఆ.వె
పుట్టినపుడెనడవ పురిటిలోనేనేర్వ
దేవతలముకాదు దేనికైన
మనిషి రీతినెరిగి మారాలి తథ్యము
మనసుపెట్టి వినుము మమతమాట

క.  (చేప)

కడలే చేపకు వాసము
కడలే లేకున్న నవియు కనబడ కుండున్ 
కడలే వాటికి లోకము
కడలే విడివచ్చిననవి కనుమూయుగదా!

క. (దృశ్య పద్యం)

వీణన్ కరమున బట్టుక
ప్రాణము వలె మీటుచు మరి పరవశమవగా
వీణా! యను పిలుపునుగని
వీణనిలిపి చూడసాగె వేగిరముగనే 

క. (కలప)

కలపలలో పలు రకములు
నిలలోనేమేలి జాతి నేదయ్యుండున్ ?
కలపయె గానతి పిరముట
కలపలలో దీనిపేరు ఘనమౌ టేకే

ఆ.వె (దృశ్య పద్యం)

చేతి విధము తోచె చెక్కతోటీకుర్చి
కలప గొప్ప తనము ఘనముతోడ
మలచి నట్టి వారు మహగొప్ప వారేను
మనసు పెట్టి వినుము మమతమాట