బాలగేయం:-మమత ఐల-హైదరాబాద్-9247593432
అందమైన ఓ చిలకమ్మా
కాకుల అరుపులు వినకమ్మ

అదిగదిగో అటు చూడమ్మా
గజరాజెంబడి శునకములు
మోతలతోటి మొరుగంగా
హుందాగా నడుస్తు వెలుతుండె

జంతు జాతిలో దర్జా తనము
చూసావా ఓ చిలకమ్మా
పక్షి జాతిలో నిన్ను మించిన
పక్షి ఉండెనా చిలకమ్మా

రామ రామ అను ముద్దు పలుకులు
కాకి పలుకునా చెప్పమ్మా
కాకులు పలికే కూతలను
నువ్వు పలికెదవు గదనమ్మ

అందమైన ఓ చిలకమ్మా
అలకలు ఇంకా చాలమ్మ
బడికి చక్కగా వెళ్లమ్మా
బలపం పట్టి దిద్దమ్మ



కామెంట్‌లు