కౌసల్య తనయుండు
శ్రీ రామచంద్రుండు
సూర్య వంశపు ఘనుడు
ఓ మమతలమ్మ
శ్రీ రామునే తలువు
రాక్షసత్వము పోవు
పలుకుటెంతో సులువు
ఓ మమతలమ్మ
రాతి నాతిగ మారె
శాపమిట్టే ఎగిరె
పాద ధూళికి వినరె
ఓ మమతలమ్మ
శాంతి రత్నంబితడు
శ్యామలాకారుండు
దశరథుని తనయుండు
ఓ మమతలమ్మ
విల్లునే పట్టాడు
పెల్లుమని విరిచాడు
జనకునింటిన ఇతడు
ఓ మమతలమ్మ
రాక్షసుల నెదిరించె
రావణుని వదియించె
ధర్మాన్ని రక్షించె
ఓ మమతలమ్మ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి