ఉపాధ్యాయుడు[బాలగేయం] మమత ఐల- హైదరాబాద్ 9247593432
విశాల గుండెగల ఉపాధ్యాయుడు
పాఠశాలఅను పంటపొలంలో
అక్షరాలను విత్తనమలికి
అజ్ఞానమను కలుపునుతీసి
విద్యార్థులను మొలకలు చేసి
విజ్ఞానమనే మందును చల్లి
జ్ఞానజ్యోతుల ప్రకాశానికి
క్రోవ్వత్తివలె కరుగుతు గురువు
ఏపుకు వచ్చే పంటమాదిరిగ
విద్యార్థులను సిద్దంచేసి
జగతికి ప్రగతిని అందిచుటలో
విద్యా ధనమను బాలబాలురను
అభివృద్ది పథంలో నడిపించేది
ఉన్నతమైన ఉపాధ్యాయుడు

తెలియని విషయము తెలియజెప్పుతు
ఉత్సాహమను ఊరటనిస్తు
బాలల ముంగిట బాటను చూపుతు
వెంటబెట్టుకొని నడిపించేటి
మార్గంచూపే మార్గదర్శిగా
మొలకలనే వృక్షాలుగ మార్చి
విద్యాధాతగ జిజ్ఞాసను పెంచి
విలువల వునికిని నేర్పేది
ఉన్నతమైన ఉపాధ్యాయుడు




కామెంట్‌లు