శ్రీవేంటేశ్వర స్వామి (సీసపద్యాలు):-మమత ఐల-హైదరాబాద్-9247593432
శ్రీవేంకటేశ్వరాశ్రీనివాసాయని
    వేడినాజనులకువేగముగను
నిత్యసంతసమిడనిలుసున్నదేవుడా
    వరములిచ్చేవుగా వజ్రధారి
యేకధాటీతోడ యేడుకొండలనెక్కి
బంగారుతొట్లెను బహుమతిచ్చె
యాపేక్షయధికమైయాడపిల్లకొరకు
   నీవరంబునుపొందెనిక్కముగను
ఆ.వె||
రాణిగానుపెంచెరఘునందనుని నింట
బాలనవ్వుజూసిబాపుమెచ్చ
మమతపేరుబెట్టి మమకారమందించె
మనసుపెట్టివినుముమమతమాట

సీ
శ్రీనివాసునియెద శ్రీమహాలక్ష్మిది
             భృగువొనర్చు పనికి మగని వీడి
భూలోకమునకేగిభోగభాగ్యాలిచ్చె
       కొలిచేడివారికికోర్కెతీర
పాలసంద్రమువీడి పాణిలక్ష్మినిజేర
      చెట్టుపుట్ట దిరిగె శ్రీ ధరుండు
గతజన్మ బంధమై గాంచెను వకులమ్మ
      పాణినిగనియెంతొపరవసించె
ఆ.వె|| 
జగతిలోనజనులుజయముగాకొలిచేటి
తగినదేవుడవని తపసితేల్చ
సత్యలోకమువిడి సౌక్యమీయగవచ్చె
మనసుపెట్టివినుముమమతమాట



కామెంట్‌లు