ముక్తీశ్వరా (పద్యాలు):-మమత ఐల-హైదరాబాద్-9247593432

 1.మ.
హర !గంగాధర !నీలకంఠ! సకలహ్లాదంబునిచ్చే శివా!
శరణంటిన్ కృప సేయవేర
మరి విశ్వంబేలు లింగేశ్వరా! 
పరమాత్మా నిరతమ్ము వేడగనె సౌభాగ్యంబు లందింతువే
సురలోకేశ్వర దీనబంధు కరుణన్ చూపించు ముక్తీశ్వరా!
2.ఉ
శీతల మంచునన్ తడిసి చెండిక ముద్దగ మారెనోమరిన్
దాత! సతీ సమేతునిగ దాగుట నీటను శోభనిచ్చునే
మాతను గౌరి గా గొలువ మంగళ హారతి తోడవేచిరే 
రాతను మార్చరమ్మనుచు రక్షణ గోరిరి భక్తులీశ్వరా!
3. ఉ
వందన మందజేదుమని పావన మూర్తిని జేరవచ్చిరే
నందన పారిజాతముల నందముగేయను జూచుచుండిరే
నందికి చేరవేచినను నాథునికందగ జేయునేయనిన్
బంధము వీడలేనిదగు భక్తుల సందడి చూడవే శివా
4.ఉ
దానము చేయుచుండెనట దైవము కైనను చేయిచాచినన్
మానవ లోకమందితడు మాన్యుని గా కొనసాగునెప్పుడున్
దానవ చక్రవర్తి బలి దైవము నీవనరణ్యమందునన్
వీనుల విందుగా కొలచి పృథ్విన నిల్పెను నీశ్వరాకృతిన్

కామెంట్‌లు