డయోనారా టీవీ:-వరుకోలు ‌మాధవి, -గృహిణి,కవయిత్రి -సిద్దిపేట-చరవాణి:9441782816.

 డయోనార టీవీరా 
మా ఊరిలో ఉండెరా
ఊరియందరికది 
ఆత్మబంధువాయెరా
తెలుపు నలుపు బొమ్మలన్నీ
తెగవచ్చుచుండెరా
వారావారమునాడు 
ఆదివారము నాడు 
పాత సినిమాలు చూసి 
పరవశించి పోదుమురా
ప్రతి శుక్రవారము 
చిత్రాలహరి వచ్చి 
చిత్రమైన పాటలువిని
చిందులేయువారమురా
భారత రామాయణాలు 
బాగుగానుచూసిజనులు 
బాధ్యతలు గుర్తెరిగి 
నీతిగానుమెలిగిరి 
తెలుపు నలుపు టీవీ పోయి 
కలరు టీవి వచ్చెరా
లెక్కలేని ప్రోగ్రాములు 
లేవకుండా వచ్చెరా
చూసిచూసి కళ్ళు పాడు
విని విని చెవులుపాడు
తీరిక లేకుండా చూస్తె 
తిప్పలెన్నొ వచ్చురా 
దేనినైనమోతాదుగ 
వాడుకుంటె మంచిది 
అతిగా నీవువాడిన 
అనర్థాలుబహుమెండు 
పాత టీవి మంచిది 
పాత రోజులుమంచివి.

కామెంట్‌లు