విద్యార్థులం మేం:---గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.--సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
విద్యార్థులం మేం విద్యార్థులం
విద్యను ఆర్జించు విద్యార్థులం
బడికి పోతాం మేం ప్రతినిత్యం
చదువే మా అందరి జీవిత లక్ష్యం!

మేం ఉద్వేగంగా కదిలే తరంగాల్లా
మా ఉత్తేజంగా మెదిలే తురంగాల్లా
పయనిస్తాం మేం మునుముందుకు
జాతి జాడ్యం వదిలించే టందుకు.!

క్రౌర్యానికి మట్టి సమాధి కడతాం
శౌర్యానికి గట్టి పునాది పెడతాం
మేం చైతన్య స్ఫూర్తిని  కలిగిస్తాం
మా జైత్రయాత్రను కొనసాగిస్తాం!

స్నేహ దీపాలను వెంటనేవెలిగిస్తాం
ద్రోహ పాపాలను ఉంటేనే కరిగిస్తాం
మంచితనాన్నిమా బాగా పెంచేస్తాం
మానవత్వాన్ని మేం వేగాపంచేస్తాం

మేం కులాల గోడలు కూల్చేస్తాం
మా మతాల కితాబుల కాల్చేస్తాం
నీతి నియమాలను మేం పాటిస్తాం
శాంతి ప్రశాంతి కి మా ఓటు వేస్తాం!

మేం చేయి చేయి కలుపు కొంటాం
మా బ్రతుకు బాట తెలుసుకుంటాం
కలసి మెలసి మేం జీవిస్తూ ఉంటాం
ఇలవెలసిజీవితాన్ని పంచుకుంటాం

సమసమాజ స్థాపన మా ధ్యేయం
అహరహం శ్రమనే మా అధ్యాయం
ఉద్యోగం ఉన్న లేకున్నా పని చేస్తాం
సద్యోగం మిన్న వారి పని పట్టేస్తాం!

ముళ్లబాట లన్నింటిని తుంచేసి
పూలబాట లెన్నింటినో పెంచేసి
అనుకున్న దాన్ని మేము సాధిస్తాం
అందరిని మేం బాగా మెప్పిస్తాం .!


కామెంట్‌లు