ఆటపాటల పిల్లలం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి-నాగర్ కర్నూల్ జిల్లా.సెల్ నెంబర్.9491387977.
మేం బబుల్ గమ్ తింటున్న చిన్న పిల్లలు
మాడబుల్ గేమ్ కంటున్న తెల్లమల్లెలం
ఆట పాట వేట లో ఉంటున్న వారలం
చోటామోటా కోటలో తింటున్న పొరలం

మా హల్చల్ హాకీ ఆట ఆడుకుంటూ ఉంటాం
మా బుల్ బుల్ సాకి
 పాట పాడుకుంటూ తింటాం
గోల్డ్ షాలిమార్ కాళ్ళ జోడు మేము కోరుకుంటాం
ఓల్డ్ గోలీమార్ సోడా నే త్రాగి మేం కోలు కుంటాం

తీరు తీరు ఆట బొమ్మలను అద్దెకు తెస్తాం
కోరి కోరి పూటకూళ్లమ్మకు ముద్దులు ఇస్తాం
జరిగినదంతా మా మంచికే అని అనుకుంటాం
పెరిగిన సొంత ఖర్చులను మేము తగ్గించుకుంటాం

మేం పదవుల వేటలో పథకాలను సాధిస్తాం
మా చదువుల బాటలో శతకాలను 
శోధిస్తాం
చేయి చేయి కలుపుకుంటు సాగుతాం ముందుకు
హాయ్ హాయి తెలుపుకుంటు
ఆనందం విందుకు

మేం విద్యా సుగంధము
 కోరుకుంటాం
మా సయోధ్య బృందాన్ని చేరుకుంటాం
మాలోని జులిమి బలిమిని తెంచుకుంటాం
ఈ లోనా కలిమి చెలిమిని పంచుకుంటాం