కరోనా మృత్యుఘోషలు:--కొలిపాక శ్రీనివాస్-9866514972.

 విశాల విశ్వంలో అడుగడుగున
కరోనా వింతైనా నృత్యాలతో
మనుషులపై నాట్యం చేస్తుంది..
బ్రహ్మ చెప్పిన కాలాంతపు ఛాయలు
కళ్ళముందు కదలాడుతున్నవి
కరోనా వైరస్ దృశ్యాలు
ఇప్పుడు కళ్ళతోనే మాత్రమే
రోదనలు,వేదనలు కనబడుతున్నాయి
వాయువు వేటగాడిలా మారి
గాలి వలను విసురుతున్నాడు
వలలో చిక్కిన శ్వాసాలను గొంతు
నులిమేసి పైలోకానికి పంపిస్తున్నాడు
స్మశానంలో క్యూ టికెట్ల గొడవ
మొదలవుతుంది నేనంటే నేను అనేలా
చోటు దొరకని ప్లేస్ కోసం
ఫైటింగ్ జరుగుతున్నట్టు
రోడ్లపై పేరుకుపోతున్న
శవాల గుట్టల దీనత్వం
విధి గీసిన గీతలో అంతా నిర్మాణుష్యమే
అందరిని చుట్టుముట్టేస్తున్నవి
అర్థం కాని ప్రశ్నలు వెంటాడుతున్నాయి
మృత్యుఘోషలుగా వినిపిస్తున్నాయి
ఏమి లేనట్టుగా తిరుగుతున్న వాళ్లతోనే
ఈ కరోనా వైరస్ వణుకు పుట్టిస్తుంది
వీళ్లు మనవాళ్లే అనే ధైర్యం
కరోనా కొంప ముంచుతుంది
మన అలసత్వానికి ఆనవాళ్లుగా
మారుతున్న మృత్యు ఘోషలకు
చివరి చరమగీతం పాడుదాం..

కామెంట్‌లు