85. ఆ.వె. క్రూర మృగము లెపుడు నేరము జేయవే
యాకలైన నపుడె హాని జేయు
క్రూర మృగము కన్న కుటిల మనిషి కీడు
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
86. ఆ.వె. దిగులు నందరికిని దేని రూపముననో
తప్పకుండ నుండు తరచి చూడ
దిగులు లేని మనిషి దిక్కుల గనరాడు
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
87. ఆ.వె. దొంగ బుద్ధి గలుగు దుర్మార్గుని మదిని
సుగుణ మొక్కటైన జూడలేము
కుక్క తోక వంచ చక్కనగున యేమి
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి