109.ఆ.వె.నిప్పు పయనమెపుడునింగిసాగుచునుండు
నీరునెపుడు పారు నిమ్నమునకు
పంచభూతములును నెంచ గతి తప్పునే
రమ్య సూక్తులరయు రామకృష్ణ .
110.ఆ.వె. పెద్దవారి మాట పెడచెవి పెట్టకు
గూఢ యర్థమెంతొ కూడి యుండు
దశరథుని పలుకుల దాశరథి వినడే
రమ్య సూక్తులరయు రామకృష్ణ .
111.ఆ.వె. పవ్వళించె విష్ణు పాముపై జలధిని
పరమశివుడు వైచు పాము మెడను
గొప్పవారలెంత తిప్పలు పడుదురో
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి