రాము ,ఆనంద్ ఇద్దరూ ఒకే తరగతి చదివే వారు. వారిలో రాముకు దేవుడంటే భక్తి ఎక్కువ. ఆనంద్ అసలు దేవుని నమ్మేవాడే కాదు.
వారిద్దరూ పరీక్షకు వెళ్తున్నారు. దారిలో ఒక దేవాలయం కనిపించింది .రాము ఆ దేవాలయానికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఇద్దరూ పరీక్షను వ్రాశారు . రాము పరీక్ష బాగా కాలేదు. ఆనంద్ పరీక్ష బాగా అయింది .
అప్పుడు ఆనంద్ " చూశావా రామూ! నీవు దేవునికి దండం పెట్టుకొని పరీక్షను వ్రాశావు .నీ పరీక్ష బాగా కాలేదు. మరి నేను దేవుని ముఖం కూడా చూడలేదు. నా పరీక్ష బాగా అయింది. ఇప్పుడేమంటావు" అని అన్నాడు. రాము ఏమి మాట్లాడలేదు.
కొన్ని రోజులకు పరీక్షల ఫలితాలు వచ్చాయి. రాము ఉత్తీర్ణుడు అయినాడు. ఆనంద్ ఫెయిల్ అయ్యాడు .రాము ఆశ్చర్యపోయి" ఇదంతా దైవలీల. ఆనాడు నేను గుడికి పోవడం వలన దేవుడు నన్ను ఉత్తీర్ణుని గావించాడు" అని అన్నాడు.
అప్పుడు ఆనంద్ " అవును. నేను పరీక్ష బాగా వ్రాసినప్పటికినీ పాసవలేదు. నాకు దేవుడు తగిన శాస్తిని చేశాడు "అని అన్నాడు ."రేపటి నుండి నేను కూడా నీతో గుడికి వస్తాను "అని అన్నాడు ఆనంద్ .ఆ తర్వాత వచ్చిన మార్కుల జాబితాలో ఆనంద్ కూడా ఉత్తీర్ణుడయ్యాడని ఉంది .ఆనంద్ ఎంతో సంతోషించి దేవుని గుడికి నిత్యం వెళ్లి దైవ భక్తుడు అనిపించుకున్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి