భరతమాత పుత్రులం:-డాక్టర్. కొండబత్తినిరవీందర్-- కోరుట్ల. జిల్లా, జగిత్యాల 9948089819
భరతమాత పుత్రులం
భావి జాతి పౌరులం
భరత జాతి తోటలలో
విరబూసే పువ్వులం

నీతిగ మే ముండెదం
నిజాయితిగ బతికెదం
జాతి కొరకు నీతి కొరకు
సాగిపోయె ధీరులం

సమభావన వేదికలం
సమైక్యతకు వారసులం
హింసకు మేం విరోధులం
శాంతి కి మేం దర్శకులం

అనురాగపు హృదయాలం
అభ్యుదయపు కిరణాలం 
అహర్నిశలు శ్రమిస్తాం
అవని కీర్తి నిలుపుతాం


కామెంట్‌లు