తెలుగు వెలుగుల తియ్యదనం ఉగాది
మామిడి కాయ వగరుతో
ఉప్పు, కారం రుచులతో
చింతకాయ పులుపుతో
వేప పూత చేదుతో
అన్నింటిని కలుపుకోని
తియ్యని బెల్లంతో
ఉగాది పచ్చడి కమ్మదనం
నేర్పును మనకు జీవిత పాఠం
రూపం లేని రేపటి కోసం
ఆశల ఒడిదుడుకులలో
దుఃఖాన్ని వదిలి సంతోషాలతో
జీవించాలని కోరుకుంటూ
శ్రీ ప్లవనామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి