'బ్రేవరీ అవార్డ్'... : - ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య


 స్కూల్ కి టైం అయింది. తొందర తొందరగా సైకిల్పై వెళ్తున్నాను. మా ఊరి చింత చెట్టు వద్ద బాగా మంది గుమిగూడారు. ఎందుకా,అని వెళ్ళినాను. సంచార జీవులు గుడారాలు వేసుకొని ఉన్నారు. వాళ్ల మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకు ఉన్నారట. ఒకడు చనిపోగా, ఒకడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా డు. దప్పిక అంటున్నాడు. నీళ్లు ఎవరు ఇస్తలేరు. అక్కడున్న విఏఓను విషయం అడిగాను. పోలీసులు వచ్చి పంచనామా చేసేదాకా ఎవరు ఎవరు వద్దకు వెళ్ల వద్దన్నాడు. అదేమీ కాదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఎవరైనా దవాఖానకు తీసుకుపోవచ్చు అని అన్నాను. నువ్వు బాధ్యత తీసుకుంటావా... నీ ఉద్యోగం పోతది అన్నాడు. ఒక ప్రాణం కంటే నా ఉపాధ్యాయ వృత్తి ఏమీ గొప్పది కాదు. నేను దేనికైనా సిద్ధమే నాకు అప్పగించండి అన్నాను. సరే అన్నాడు. మా సైకిలు అక్కడ ఉన్న వారికి ఇచ్చి, ఇంటికాడ పెట్టమన్నాను. ఆయనకు నీళ్ళు తాగించి దవాఖానకు ఆటోలో తీసుకొని సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన కి వెళ్లాను. అక్కడకు సర్పంచ్ చెన్నయ్య (మా పెదనాన్న కొడుకు) అన్న వచ్చాడు. నేను చూసుకుంటా నీవు స్కూల్ కి వెళ్ళు అన్నాడు. నేను స్కూల్ కి వెళ్ళాను. ఒకసారి బ్రేవరీ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని పేపర్ లో చూసి, ఈ విషయమంతా రాసి, గజిటెడ్ సంతకం చేయించి పంపాను. ఢిల్లీ నుండి బ్రేవరీ అవార్డు రెడ్ అండ్ వైట్ 1999-2000 అందుకున్నాను.