అవి నేను చిన్నతనంలో అంటే ఆరో క్లాస్ చదువుతున్న రోజులు. మా ఊర్లో ఆడుకోవడానికి బోలెడు ఆట స్థలాలు ఉండేవి ఆటస్థలాలు అంటూ ప్రత్యేకంగా ఉండేవి కావు, కానీ ఆటస్థలాలు మేము ఎన్నకునేవాళ్ళం. అందులో చెరువులు, చెరువుగట్టు, పంటపొలాలు, పొలాల గట్లు ,పాడుబడిన బంగళాలు ఇవన్ని ఉండేవి . అందులో భాగంగా మాకు స్నేహితుడు శర్మ ఇల్లు మరీ ప్రత్యేకంగా వుండేది. దాదాపుగా ఒక ఎకరం లో, చుట్టూ పది అడుగుల ఎత్తు ప్రహరీ గోడలు,ముందుగా పెద్దగా తలుపులు, లోపల ఎన్నో చెట్లు, పండ్ల తోటలు వుండే వి. అందులో ఒక వైపు పాడుపడ్డ బంగళా, మాకు ఆట విడుపు. అందులో పాములు కూడ వున్డేవి. మా అలికిడి విని అవి వెళ్లి పోయిన తర్వాత ,మేము మా ఆటలు ఆదుకునే వాళ్ళం.
కొన్నాళ్ల తర్వాత శర్మ వాళ్లు ఎందుకో, ఆ ఇల్లు వదిలి వేరే ఇంటికి మారి పోయారు. ఆ ఇల్లు ఎప్పుడు చూసినా తాళాలు వేసి వుండేది. మేము ఆ ఇల్లు చూస్తూ వెళ్ళే వాళ్ళo. కాస్త బాధ కలిగేది మంచి ఆట స్థలం పోయింది అని. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. అందరం కలిసి గోడ దూకి లోపలికి వెళ్లే ప్రణాళిక వేశాము
అయితె ఆ ప్రహరీ చాలా ఎత్తులో ఉంది. అప్పుడు నాకు గుర్తు వచ్చింది ఏమిటంటే ,వెనక వైపు వున్న గోడ తలుపు చిన్నది,. దానికి అన్నీ చిల్లు లు -పగుళ్లు వుండే వి. వెంటనే అందరం వెనుకకు వెళ్ళి, ముందుగా నేను తలుపులు పట్టుకుని పైకి ఎగబాకి గోడ మీదకి ఎక్కా ను. అటు వైపు దిగడానికి సరిగ్గా లేదు. ధైర్యం చేసి దూకే సాను.
మిగిలిన అందరూ స్నేహితులు అదే పని చేశారు. ఇంకేముంది లోపలికి వెళ్లి ,ఆటలే మా సంతోషం చెప్పనలవి కాదు. ఆఖరున జామచెట్టు మీద కళ్ళు పడ్డాయి. జామ చెట్టు విరగ కాసింది ,దాని నిండా పళ్ళు ,ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరు కదా. మేము కాస్సేపు కోతుల కింద మారిపోయాము .అందరం చెట్టెక్కి హాయిగా కూర్చొని కోసుకుని తినడం మొదలు పెట్టాము.
అలా ఎంతసేపు గడిచిందో తెలీదు ఆ చెట్టుమీద ఆటలు కూడా మొదలయ్యాయి.
అప్పుడే మాకు పెద్ద అరుపు వినిపించింది ,చూస్తే ఏముంది కింద ఒక పెద్దాయన నిలబడి ఉన్నాడు. ఆయన కట్టె పట్టుకొని పెద్దగా అరిచాడు ఎవర్రా వెధవల్లారా ఎలా వచ్చారు లోపలికి అని. మా అందరి ముఖాలూ చూడాలి, భయం -భయం ,తో బిక్క చచ్చిపోయా ము. దిగండి. .దిగండి..అన్నాడు మేమందరము, దిగకుండా అలాగే,చెట్టు కొమ్మల్లో కూర్చున్నాం. ఎందుకంటే దిగితే కొడతారు కదా ! కర్ర తోటి అందుకని. ఆ పెద్దాయన కి కథ అర్థం అయిపోయింది, మేము భయానికి దిగటం లేదని. కాసేపటికి అతను మమ్మల్ని బుజ్జగించడం మొదలు పెట్టాడు, నేను ఏమీ అనను దిగండీ. . అని. మాలో కొందరు, ధైర్యం చేసి దూకి పారిపోయారు ముందు తలుపులోంచి. అంతలో ఇంకొకరు వచ్చారు ,ఆయన అడిగారు వీళ్ళ అసలు లోపలికి ఎలా వచ్చారు అని. నేను పైన, కొమ్మమీద ఎత్తు లో ఉన్నాను, నాకు దిగటానికి ధైర్యం సరిపోవట్లేదు .నేనన్నాను ముందు తలుపు తీసే ఉంది ,అందులోంచి వచ్చాము అని. ఆయన అన్నారు వెధవా, ముందు తలుపు తాళం నేనే తీసాను మీరు ఎలా వస్తారు అన్నాడు? ఆయనకు బయటనుంచి వెళుతుండగా చెట్లు ఊగడం మరియు మా అరుపులు కేకలు వినిపించాయి అట. అందుకే ఆశ్చర్యపోయి తలుపు తీసుకొని వచ్చాడు. అప్పుడు తెలిసింది మా పొరపాటు ఏంటో. మేము దొంగతనంగా అందులోకి వెళ్లి న సంగతి మర్చిపోయి ,హాయిగా ఆటలు అరుపులు కేకలతో గడిపాము. అదీ సంగతి. ఆఖరు న నేను కూడా దిగి పరిగెత్తాను బతుకు జీవుడా అనుకుంటూ. ఏది ఏమైనా కొని తినే పండ్ల కంటే కొట్టుకొచ్చిన పండ్లు తీయగా ఉంటాయి అని అర్థమైంది. మేము ఏం చేసినా మా ముఖ్య ఉద్దేశం ఆటలు సంతోషం ఆనందం నవ్వులు మాత్రమే! రోజుకు ఒక ఆట రోజుకో రకమైన ఆనందం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి