ముద్దుముద్దు పొద్దు: -కిలపర్తి దాలినాయుడు

 చెట్టుమీద పుట్టిందో
ముద్దుముద్దు పొద్దు!
కన్నార్పక చూడండోయ్
మనసుకిచ్చు ముద్దు!
పొద్దునాన్న  అందాలని
ఎంత తపన దీనికి!
అమ్మ కొమ్మ చెంక నుండి
ఊగుతుంది గాలికి!
ఆకుపచ్చ పేరులోన
అందమైన మణిలా
కంటిపాపలో అంటిన
చంటిపిల్ల సొబగులా!
ఊగుతుంది ఊగుతుంది
ఈ పసుపు ప్రసూనం!
ఆనందించండి మీరు
చూసిన మరు క్షణం!
--------------------------------------------
(మా పాఠశాల ప్రాంగణంలోది ఈదృశ్యం)