పాపాయి పూలజడ =మణిపూసలు :--ఎం. వి. ఉమాదేవి.
పాపాయికి పూలజడా 
సరిగ అంచుల పావడా 
వెనుక అద్దంతో ఫోటో 
అమ్మ,నాన్నకి సందడా !

మల్లెలు,కనకాంబరాలు 
మరువము,దవనపు ఆకులు 
మధ్యలో గులాబీలను 
గుచ్చి అల్లు కనువిందులు !

దోస్తులతో గొప్పగాను 
చూపుతుంది ముదముతోను 
పూలజడా కోసమేగ
కూర్చున్నది ఓర్పుగాను !

సవరముతో పొడుగుగాను 
అల్లిజడను చక్కగాను 
అట్ఠ, అరటి పట్ట మీద
పూలుగుచ్చి పెట్టు జడను !

అందరునూ వచ్చి చూసె
ఆనందం కలుగజేసె 
చిన్నిపాప బుగ్గ పుణికి 
ముద్దులిచ్చి దిష్టి తీసె!