ఓ కోతి ఏట్లో పడింది.
దానికి ఈత రాదు.
మునుగుతూ, తేలుతూ కొట్టుకుపోతుంది.
ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతుంది.
“దేవుడా! దేవుడా!! నన్ను కాపాడితే నీ కొండకు వచ్చి కోటి కొబ్బరి కాయలు కొడత" అని మొక్కింది కోతి.
కోతి అవస్థను చేప చూసింది.
వచ్చి వీపు మీద ఎక్కించుకుంది.
ఒడ్డున పడేసింది.
కోతి 'బతుకుజీవుడా' అంటూ పరుగెత్తింది.
కొన్నాళ్ళు గడిచాయి.
కోతి మొక్కు సంగతి మరిచిపోయింది.
కొండ మీద దేవుడు దిగి వచ్చాడు.
“మొక్కు తీర్చవా" అని అడిగాడు.
“ఏ మొక్కు... నన్ను కాపాడింది నువ్వెందుకాయే. చేప కదా?” అంది కోతి.
దేవుడు వెళ్ళిపోయాడు.
కొన్ని రోజులకు చేప వలలో పడింది.
జాలరి బుట్టలో వేసుకున్నాడు.
ఒడ్డున పడేశాడు.
అప్పుడే కోతి అటు వైపుకు వచ్చింది.
“కోతి ! కోతి!! నన్ను కాపాడవా? అప్పుడు నిన్ను కాపాడాను కదా? ఇప్పుడు నన్ను రక్షించు" అంది చేప.
“నన్ను కాపాడింది నీవెందుకాయే. దేవుడయితే.
నీవు ఎవరివో నాకు తెలియదుపో" అంది కోతి.
వెంటనే చేప దేవుడిగా మారింది.
“కోతీ! ఇంకెప్పుడు ఇలా తప్పించుకునే ఉపాయాలు ఆలోచించకు.
అది నీకే ముప్పు.
దేవుడినే మోసం చేస్తావా?
తప్పు కదా! ఈ సారికి క్షమిస్తున్న.
ఎప్పుడైనా ఇలా జరిగితే డొక్కచించి డోలు కడతా" అన్నాడు దేవుడు.
కోతి చెంపలేసుకుంది.
క్షమాపణ కోరింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి