*కెరటాలు*:-*డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి*-అనకాపల్లి, విశాఖ జిల్లా
కెరటాలమ్మా కెరటాలూ
పిల్లలు ఆడుకొనే కెరటాలు
నురగల తరగల కెరటాలూ
పరుగులు తీసే కెరటాలు

బుస్సున లేచే కెరటాలు
దబ్బున విరిగే కెరటాలు
కాళ్ళను తడిపే కెరటాలు
ఇసుకను లాగే కెరటాలు

 హోరున జోరున కెరటాలు
కేరింతల తుళ్ళే కెరటాలు
పూల బుడగల కెరటాలు
బీచిలో బలేబలే కెరటాలు.కామెంట్‌లు