చేతి సంచీ -బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
చక్కని నేస్తం చేతి సంచీ 
ఎంతో మేలు దీన్నుంచి 
బజారుకైనా ఊర్లకెళ్ళినా 
ఎన్నో వస్తువులు ఉంచీ !

చేనేతలకు చక్కని రూపం 
అనేక రంగులు బొమ్మలతో 
గణితం గుర్తులు ఉంటాయి 
పక్షులు జంతువుల్ సంచీపై !

కళ్ళజోడు

, మరి డైరీ, పెన్ను 
మందూమాకూ ఉంచే తెన్ను 
డబ్బుల పర్సు జాగ్రత్తండోయ్ 
జేబులోకంటే సంచీరక్షణోయ్ !

ఒడిలో ఒదిగి ఉంటుంది 
బడిలో పాఠం వింటుంది 
సంచీలోని తాయిలాలతో 
స్నేహం బాగా నడుస్తుంది !

కామెంట్‌లు