సన్మానం: -- యామిజాల జగదీశ్
సన్మానం
పూర్వమేమోగానీ
ఇప్పటివన్నీ
లోపాయకారి సన్మానాలే
సన్మానం చేస్తాను
అయితే నాకేంటి లాభం
అనేదే ఇప్పటి తీరు

మీరు చేస్తేసరి
లేకుంటే
సన్మానం
చేయించుకుంటాననే
కవుల సంఖ్యకు 
అంతులేదు

ప్రభుత్వాలు మొదలుకుని
గల్లీ సంఘాల వరకూ
చేసే సన్మానాల వెనుక
స్వలాభం ఉంటూనే ఉంటుంది

ఈరోజుల్లో
అర్హతకు గుర్తించి
చేసే సన్మానాలను
వేళ్ళ మీద లెక్కించొచ్చు

ఈరోజుల్లో 
సన్మానాలు
అమ్ముకోవడాలూ
కొనుక్కోవడాలే

ఆమధ్య
ఓ నగరంలో 
ఓ సంఘం
బహిరంగంగానే
ఓ ప్రకటన చేసింది
"సన్మానాలు చేస్తాం
వచ్చి చేయించుకోండని"
ఈ ప్రకటన మాటెలా ఉన్నా
అటువంటి
స్థాయికి తగ్గిన సన్మానాలు
పొందడానికి
కవులు వరుస కట్టడం
హాస్యాస్పదం

అందుకే
ఈనాటి సన్మానాలన్నీ
దండగమారివే
ఈ సభలకు వెళ్ళడం
ప్రేక్షకులకు శిక్షే
కారణం
పరస్పర పొగడ్తలతోనూ
బలవంతపు చప్పట్లతో 
వేదికలు మార్మోగడం

అందుకే
ఈ కాలపు సన్మానాలన్నీ
చెత్తన్నర చెత్తే